అమరావతి: రాజకీయ కక్ష, పొలం తగాదాల నేపథ్యంలో అంగన్‌వాడీ టీచర్‌ను 50 ఏళ్ల మహిళ ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం రావివారిపాలెంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. రావివారిపాలేం గ్రామంలో సవలం సుధాకర్ అనే వ్యక్తి టిడిపిలో ఎస్‌సి సెల్ మండల అధ్యక్షుడిగా ప్రజలకు రాజకీయంగా సేవలందిస్తున్నాడు. సుధాకర్ భార్య హనుమాయమ్మ అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తుంది. కొండపి టిడిపి ఎంఎల్‌ఎ డోలా బాలవీరాంజనేయ స్వామికి అనుచరుడిగా సుధాకర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. సవలం కొండలరావు వైసిపి కార్యకర్తగా ఉన్నాడు.
Also Read: కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగులు ఉండగా తలుపుకు తాళం వేసి..
సుధాకర్ రాజకీయంగా ఎదుగుతుండడంతో పాటు కొండలరావు పొలం విషయంలో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో ఇద్దరిలో ఒకరిని చంపుతానని కొండలరావు పలుమార్లు బెదిరించాడు. హనుమాయమ్మ అంగన్‌వాడీ పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం తన ఇంటికి వచ్చింది. ఇంటి ముందు నిలబడి తన కుమార్తెను నీళ్లు ఇవ్వమని అడిగింది. ఆమె నీళ్లు తాగుతుండగా అక్కడే వేచి ఉన్న కొండల్ రావు ట్రాక్టర్‌తో గొడను ఢీకొట్టాడు. వెంటనే ఆమె కింద పడిపోవడంతో ఇంకా మృతి చెందలేదని నిర్ణయించుకొని ట్రాక్టర్‌తో తొక్కించి చంపి అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె కూతురు కేకలు వేయడంతో వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని పరీక్షించిన వైద్యులు చెప్పారు. మృతురాలు భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తి వివరాలు తరువాత చెబుతామని వెల్లడించారు.