- Advertisement -
బిక్నూర్: కామారెడ్డి పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. చలాన్ల మీద ఉన్న శ్రద్ధ రోడ్డు ప్రమాదాల మీద లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బైక్ నడిపేవాళ్లకు హెల్మెట్ లేకుంటే ఫైన్ వేయడం కామన్. కానీ ట్రాక్టర్ డ్రైవర్ కు హెల్మెట్ లేదని పోలీసులు జరిమానా విధించడం చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం చించోలికి చెందిన ట్రాక్టర్ యజమాని సతీష్ కు ఆన్ లైన్ లో చలాన్ పడింది. ఎపి-25ఎఆర్ – 4194 నంబర్ గల వాహనం ఫిబ్రవరి 25న మద్దికుంట మర్రి ఎక్స్ రోడ్ లో హెల్మెట్ లేకుండా వాహనం నడిపినట్లు ఉంది. మొత్తం రూ.1,035 మీ-సేవలో చెల్లించాలని మెస్సెజ్ వెళ్లింది. దాన్ని చూసిన సతీష్ షాక్ అయ్యాడు. గతంలోనూ ఇలానే మూడు చలాన్లు చెల్లించానని తెలిపాడు. ఎదో ఒక నంబర్ కొట్టి ఫైన్లు విధిస్తున్నారని ఆరోపించాడు.
Tractor driver gets fined for driving without helmet
- Advertisement -