Thursday, January 23, 2025

తనకు తానుగా కదిలిన ట్రాక్టర్..అద్దం పగలగొట్టి.. షాపు లోపలకు చొరబడి..(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: డ్రైవర్ లేకుండానే స్టార్ట్ అయిన ఓ ట్రాక్టర్ అద్దం బద్దలు కొట్టుకుంటూ షాపులోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించింది. ఈ వింత సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఇటీవల చోటుచేసుకుంది. ఈ దృశ్యాన్నంతా షాపులోని సిసిటివి కెమెరా బంధించింది. జె భుల్లర్ అనే యూజర్ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశాడు.

షాపు ముందు పార్క్ చేసిన ట్రాక్టర్ తనకు తానుగా స్టార్ట్ అయి ముందుకు కదలడం ఈ వీడియలో కనిపించింది. షాపు ముందు నిలిపి ఉన్న ఒక సైకిల్, మరో బైక్ కూడా ట్రాక్టర్ కిద నలిగిపోయాయి. షాపు అద్దాన్ని బద్దలుకొట్టుకుంటూ షాపులోపలకు ట్రాక్టర్ దూసుకువచ్చిది. వెంటనే అప్రమత్తమైన షాపులోని వ్యక్తి ఒకరు తన చేతులతో ట్రాక్టర్ బ్రేకులను నొక్కడంతో అది ముందుకు కదలకుండా ఆగిపోయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News