Monday, December 23, 2024

ట్రాక్టర్ వాగులో పడి ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సదాశివపేట: ట్రాక్టర్ అదుపుతప్పి వాగులో పడడడంతో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్కూర్‌లో శనివారం చోటుచేసుకుంది. సదాశివపేట సిఐ నవీన్‌కుమార్ తెలిపిన కథనం ప్రకారం… కొల్కూర్ గ్రామానికి చెందిన రామన్న (56), మంగళి గోపాల్ (40), మల్లేశం (32)మధ్యాహ్నం 12గంటలకు కొల్కూర్ నుంచి నిజాంపూర్ గ్రామానికి ట్రాక్టర్‌పై వెళుతున్న క్రమంలో కొల్కూర్ గ్రామ శివారులోని వాగులో అదుపుతప్పి నీటిలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ట్రాక్టర్ కింద చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు సిఐ తెలిపారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సిఐ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News