Thursday, January 23, 2025

అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా

- Advertisement -
- Advertisement -

మండలంలోని నర్సాపూర్ (డబ్లు) ఎక్స్ రోడ్డు సమీపాన అదే గ్రామానికి చెందిన పుట్టి భీమేష్ పంట పొలాల్లో దుక్కుదున్నీ ఇంటి కొస్తున్న తరుణంలో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న డివైడర్ పై ఎక్కించడంతో బోల్తా పడింది . దీంతో ట్రాక్టర్ కింద భీమేష్ ఇరుక్కపోవడంతో వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన ట్రాక్టర్‌ను చేతుల సహాయంతోనే పక్కకు నెట్టేసి బాధితుడు భీమేష్‌ను బయటకు తీశారు.చికిత్స నిమిత్తం నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి అక్కడక్కడ గాయాలు కాగా ట్రాక్టర్ ఒక వైపున పూర్థిగా దెబ్బ తిన్నట్లు స్థానికులు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News