Wednesday, January 22, 2025

ట్రాక్టర్‌ బోల్తా.. బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

చండ్రుగొండ: భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలంలోని పోకలగూడెం..రావికంపాడు గ్రామాల మధ్య రోడ్డుమలువు వద్ద ఆదివారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటనలో ఆళ్ళకుంట బాలవెంకటగణేష్ (14) అనే బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం…. మండలంలోని అయన్నపాలెం గ్రామానికి చెందిన ఆళ్ళకుంట కృష్ణ, మహాలక్ష్మి దంపతులకు ఇద్దరు మగపిల్లలు అందులో బాలవెంకటగణేష్ ఇటుకలు మోసేందుకు ముఠాతోపాటు కలిసి వెళ్ళాడు. అయ్యన్నపాలెంలో ఇటుకలబట్టి నుండి ట్రాక్టర్‌పై లోడు వేసుకుని పోకలగూడెం వెళ్ళారు.

తిరుగు ప్రయాణంలో మలుపు వద్ద అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తా కోట్టింది. ఇంజన్‌పై డ్రైవర్ పక్కన కూర్చుని ఉన్న బాలుడు ఇంజన్‌కింద పడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన గ్రామస్థులు జేసీబీతో ట్రాక్టర్ ఇంజన్‌ను తొలిగించి బాలుడిని తీశారు. తీవ్రంగా గాయపడిన బాలుడ్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. దీంతో అయ్యన్నపాలెంలో విషాదచాయలు అలుముకున్నాయి. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గొల్లపల్లి విజయలక్ష్మి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News