Sunday, December 22, 2024

ట్రాక్టర్ కింద పడి రైతు మృతి…

- Advertisement -
- Advertisement -

కొండపాక: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ నడుపుతున్న రైతు అదే ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లా కొండపాల మండలం ఆరెపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ పోలం వద్ద గురువారం చోటుచేసుకుంది. ఆరెపల్లి గ్రామంలో ట్రాక్టర్ నడుపుతున్న రైతు లడె నర్సింగరావు (50) వ్యవసాయ పోలంలో వడ్లను ఇవ్వడానికి ట్రాక్టర్లు తీసుకెళ్తుతుండగా అది ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో రైతు ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికుల సమాచారంతో కుకునూరుపల్లి పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పుష్పరాజ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News