Sunday, December 22, 2024

యుపిలో ఘోర ప్రమాదం: 21 మంది మృతి

- Advertisement -
- Advertisement -

షాజహాన్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 21 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. వంతెన పై నుంచి వెళ్తూ ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో బోల్తా పడింది. గుర్రా నది నుంచి నీళ్లు తీసుకురావడానికి 30 మంది ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

బాధితులను అజ్మత్ పూర్ కు చెందినవారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై యుపి సిఎం యోగి అదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున పరిహారం అందజేస్తామని సిఎం యోగి ప్రకటించారు. సంఘటనా స్థలంలో ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు ఉన్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News