Sunday, December 22, 2024

ముందు టైర్లు గాల్లో… డ్రైవింగ్ సూపర్ … వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొన్ని వీడియోలు చూస్తుండగానే వైరల్ అవుతాయి. ఓ ట్రాక్టర్ చెరుకు లోడ్‌తో వెళ్తుండగా ఓవర్ లోడ్ పడడంతో ముందుకు వెళ్లలేకపోతుంది. ముందున్న టైర్లు గాల్లోకి లేవడంతో నెమ్మదిగా వెళ్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో వీక్షించిన వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. రోడ్డుపై ప్రమాదకరంగా డ్రైవింగ్ చేయడం మంచిది కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోను హర్ష గోయంక, ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ట్రాక్టర్ ముందున్న టైర్లు గాల్లోకి లేచిన కూడా డ్రైవర్ డ్రైవింగ్ గొప్పగా చేశాడని నెటిజన్లు ప్రశంసిస్తుండగా కొందరు ఇలాంటివి రోడ్ల మీద చేయకూడదని విమర్శిస్తున్నారు. ఇలా ప్రమాదకరంగా రోడ్లపై డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. రోడ్ల మీద రూల్స్‌అతిక్రమించిన వారిని కఠినంగా శిక్షించాలని కామెంట్లు పెడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News