- Advertisement -
ఇస్లామాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడం సాధ్యం కాదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేశారు. దేశ అవసరాల దృష్టా భారత్ నుంచి పంచదార, కాటన్ దిగుమతి చేసుకోవాలని ఆర్థిక సమన్వయ కమిటి(ఇసిసి) సిఫారసు చేయగా, కేబినెట్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు వస్తువుల దిగుమతుల విషయంలో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని వాణిజ్యశాఖ, ఆర్థిక బృందాలకు ఖాన్ సూచించినట్టు డాన్ పేర్కొన్నది. 2019లో జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేస్తున్నట్టు పాకిస్థాన్ ప్రకటించింది.
- Advertisement -