Monday, February 24, 2025

పాక్, బంగ్లాదేశ్ మధ్య మళ్లీ వాణిజ్య బంధం

- Advertisement -
- Advertisement -

పాక్ రేవు నుంచి బంగ్లాదేశ్‌కు బియ్యం నౌక పయనం
ఇస్లామాబాద్ : 1971లో దేశ విభజన తరువాత పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరాసరి వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాయి. మొదటిసారిగా ప్రభుత్వ ఆమోదిత సరకుల నౌక పోర్ట్ ఖాసిమ్ నుంచి బయలుదేరిందని ఒక మీడియా వార్త తెలిపింది. పాకిస్తాన్ వాణిజ్య సంస్థ (టిసిపి) ద్వారా 50 వేల టన్నుల పాకిస్తానీ బియ్యం కొనుగోలుకు బంగ్లాదేశ్ అంగీకరించింది. ఈ మేరకు ఈ నెల ప్రథమార్ధంలో ఒక ఒప్పందం కుదిరింది. ‘మొదటిసారిగా ప్రభుత్వ కార్గోలో పాకిస్తాన్ జాతీయ నౌకాయాన సంస్థ (పిఎన్‌ఎస్‌సి) నౌక బంగ్లాదేశ్‌లోని ఒక రేవులో లంగరు వేస్తుంది.

సాగరయాన వాణిజ్య సంబంధాల్లో అది గణనీయమైన మైలురాయి అవుతుంది’ అని ‘ఎక్స్‌ప్రెస్ ట్రైబ్యూన్’ వార్తా పత్రిక తెలియజేసింది. తూర్పు పాకిస్తాన్ 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ పేరిట స్వతంత్ర దేశంగా అవతరించింది. సరకుల రవాణా 1971 తరువాత పునరుద్ధరించిన అధికారిక వాణిజ్యయ సంబంధాలకు తొలి సంకేతం అయింది. ఈ నెల ప్రథమార్ధంలో ఖరారు చేసిన ఒప్పందం కింద బంగ్లాదేశ్ టిసిపి ద్వారా పాకిస్తాన్ నుంచి 50 వేల టన్నుల బియ్యం దిగుమతి చేసుకుంటుంది. నౌకల ద్వారా రవాణా రెండు దశలుగా జరుగుతుంది. తక్కిన 25 వేల టన్నుల బియ్యాన్ని మార్చి ప్రథమార్ధంలో బంగ్లాదేశ్‌కు పంపుతారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News