Wednesday, March 19, 2025

మే 20న దేశవ్యాప్త కార్మిక సమ్మె

- Advertisement -
- Advertisement -

మే 20న దేశ వ్యాప్త సమ్మెకు అనేక కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. లేబర్ కోడ్ రద్దు చేయడం, ప్రైవేటీకరణను నిలిపివేయడం, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపాలనే డిమాండ్లతో ఈ సమ్మె నిర్వహించనున్నాయి. నెలవారీ కనీస వేతనం రూ .26,000, ఉద్యోగుల పెన్షన్ పథకం కింద నెలవారీ పెన్షన్ రూ. 9000 అందించడం కూడా ఈ సంఘాల డిమాండ్లలో ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే విరాళాలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, దాని ద్వారా ఏ పథకం కిందకు రాని వారికి

నెలకు రూ. 6000 ఇవ్వాలని కూడా యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర కార్మిక సంఘాలు , స్వతంత్ర రంగాల సమాఖ్యలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో కార్మిక జాతీయ సమావేశం నిర్వహించాయి. రెండు నెలల పాటు ప్రచారం జరపాలని కార్మిక సంఘాలన్నీ కలిపి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమ్మె భవిష్యత్తులో కార్మికులు, రైతుల దేశవ్యాప్త నిర్ణయాత్మక పోరాటాలకు నాంది పలుకుతుందని ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. దేశంలో నిరుద్యోగం, పేదరికం, అసమానతలకు వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగిస్తున్నట్టు కార్మిక సంఘాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News