Wednesday, January 22, 2025

అక్రమ సెక్స్ వేళ వ్యాపారి గుండెపోటు మరణం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : పనిమనిషితో కామం తీర్చుకుంటుండగా స్థానిక వ్యాపారి బాలసుబ్రమణియన్‌కు గుండెపోటు వచ్చి మృతి చెందాడు. దీనితో కంగారుపడ్డ ఆ మహిళ తన భర్తను, సోదరుడిని పిలిచి విషయం తెలియచేయగా, వారు పోలీసులకు విషయం తెలియకుండా ఉండాలని ఈ వ్యక్తి శవాన్ని ప్లాస్టిక్ సంచీలో పెట్టి స్థానిక జెపి నగర్‌లో పడేశారు. అయితే ఈ వ్యాపారవేత్త అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో ఆయన ఫోన్‌కాల్ రికార్డుల ఆధారంగా ఈ మహిళ లోగుట్టు వెల్లడయింది. దీనితో విచారించగా కథంతా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇప్పుడు ఈ మహిళను, ఆమె భర్తను, సోదరుడిని అరెస్టు చేశారు. పోస్టుమార్టం నివేదిక తరువాత ఇతరత్రా దర్యాప్తుల తరువాత మిగిలిన విషయాలు నిర్థారణ అవుతాయని పోలీసులు తెలిపారు. వ్యాపారి బాలసుబ్రమణియన్‌కు ఇటీవలే గుండెకు సంబంధించి అంజియోగ్రామ్ జరిగింది. బయట ఏదో పనిమీద వెళ్లుతున్నానని ఇంటినుంచి వెళ్లిపోయి కన్పించకుండాపొయ్యాడని ఈ వ్యాపారి కుటుంబ సభ్యులు తెలిపారు. భయంభయంగా సెక్స్ సాగించే క్రమంలో ఆయనకు గుండెపోటు వచ్చి ఉంటుందని, ఈ క్రమంలో మరణించి ఉంటాడని వెల్లడైంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News