Saturday, November 16, 2024

జమ్ములో రిలయన్స్ స్టోర్ ప్రారంభంపై వ్యాపారుల నిరసన

- Advertisement -
- Advertisement -

జమ్ము: జమ్ములో రిలయన్స్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించడంపై వ్యాపారులు ఆదివారం నిరసన ప్రకటించారు. చిన్నవ్యాపారాల రక్షణ కోసం ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్(సిసిఐ) అధ్యక్షుడు అరుణ్ గుప్తా, నెహ్రూ మార్కెట్ వేర్‌హౌస్ ట్రేడర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు దీపక్ గుప్తా నాయకత్వంలో వ్యాపారులు జ్యూయల్ చౌక్ సమీపాన రిలయన్స్ స్టోర్ బయట శాంతియుతంగా ధర్నా సాగించారని అధికారులు తెలిపారు. శాంతి భద్రతల కోసం ఎక్కువ సంఖ్యలో పోలీస్ బలగాలను అక్కడ నియమించినట్టు చెప్పారు. జమ్ములో రిలయన్స్ స్మార్ట్ బజార్‌లో గ్రాసరీలు నుంచి మందులు వరకు, ఎలెక్ట్రానిక్స్ నుంచి లిక్కర్ వరకు అన్నీ అమ్ముతారని, దీంతో చిన్నవ్యాపారాలు మూసివేయవలసి వస్తుందని, వారు ఆవేదన వెలిబుచ్చారు. చిన్న వ్యాపారుల ప్రయోజనాలు కాపాడాలని నిరంతరం తాము వేడుకుంటున్నా ప్రభుత్వం కార్పొరేట్లకే అవకాశం కల్పించడం తమ మనుగడకే ప్రమాదమని విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు స్థానిక ప్రజల ప్రయోజనాలను కాపాడతామని, ఉద్యోగాలు కల్పిస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఆ ఆర్టికల్ రద్దు చేసిన తరువాత స్థానిక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మాజీ మంత్రి యోగేష్ సాహ్నే ఆరోపించారు.

Traders denied to opening of Reliance Store in JK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News