Thursday, December 26, 2024

సాంప్రదాయంగా గిరిజన దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

జఫర్‌గడ్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శనివారం మండలంలోని గిరిజన తండాల పంచాయతీల్లో గిరిజన దినోత్సవాన్ని సాంప్రదాయ బద్ధ్దంగా నిర్వహించారు. ఆయా తండాల్లో గిరిజనులు సాంప్రదాయ దుస్తులు ధరించి, డిజే చప్పుళ్లతో నృత్యాలు చేసుకుంటూ ర్యాలీ చేపట్టారు. ఆరాధ్య దైవం అయిన సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం సిఎం కెసిఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. గిరిజనులకు ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు నివేదించారు. మండలంలోని ఆళ్వార్ బండ తండ (శంకర్ తండ)లో జరిగిని గిరిజన దినోత్సవ వేడుకల్లో స్థానిక సర్పంచ్ బానోతు తులసి, గ్రామ ప్రత్యేకాధికారిణి కె శిరీష, గిరిజన దినోత్సవ ప్రత్యేకాధికారిణి ఇస్లావత్ రజిని, పంచాయతీ కార్యదర్శి రాజు, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రేగడి తండలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భూక్య పార్వతి రవి నాయక్, ఎంపిడివో శ్రీధర్ స్వామి, ఎంపిఒ సుమన్, గిరిజన దినోత్సవ ప్రత్యేకాధికారిణి బి సాంబక్క, గ్రామ ప్రత్యేకాధికారిణి ఎ సామ్రాజ్యం, పంచాయతీ కార్యదర్శి సృజన పాల్గొని సేవాలాల్ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. దుర్గ తండలో స్థానిక సర్పంచ్ బాదావత్ దేవి రవి నాయక్, గ్రామ ప్రత్యేక అధికారి గట్టు శ్రీనివాస్, గిరిజన దినోత్సవ ప్రత్యేకాధికారిణి గుగులోతు సుజాత, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన డిజె పాటలకు గిరిజన మహిళలు నృత్యాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News