Thursday, January 23, 2025

కంటోన్మెంట్ రహదారుల్లో రాకపోకలకు రక్షణ శాఖ అనుమతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఐదు రహదారులను ప్రజల వినియోగానికి తెరిచేందుకు రక్షణ శాఖ అనుమతించడం పట్ల కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రిచర్డ్సన్, ప్రోట్నీ, బయామ్, అమ్ముగూడ, అల్బయిన్ రోడ్లను సామాన్య ప్రజల రాకపోకల కోసం అనుమతించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని కిషన్‌రెడ్డి ట్వీట్ చేశారు.

పలుమార్లు ఈ అంశంపై వారిని కలిసి సమస్యను విన్నవించాను. రోడ్లను తెరిచేందుకు రక్షణమంత్రి మనస్ఫూర్తిగా అంగీకరించారు’ అని కిషన్‌రెడ్డి తెలిపారు. ‘జాతీయ భద్రత, ప్రజలకు సౌలభ్యం అనే రెండు సున్నితమైన అంశాల విషయంలో అన్ని పక్షాలు కలిసి కూర్చుని చర్చించుకుని పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవనాన్ని సౌలభ్యం చేసేందుకు కృషి చేస్తోందని కేంద్రమంత్రి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News