- Advertisement -
హైదరాబాద్: ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు రాయితీ శుక్రవారంతో ముగియనుంది. వాహనాలపై భారీ ఎత్తున పెండింగ్ చలాన్లు ఉండడంతో తెలంగాణ పోలీసులు రాయితీపై ట్రాఫిక్ చలాన్లు చెల్లించేలా రాయితీ ప్రకటించారు. దీనికి వాహనదారులపై నుంచి మంచి స్పందన వచ్చింది. వాహనదారులకు మరోసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో గడువును పొడిగించారు. మరికాసేట్లో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ గడువు ముగియనుంది. ఇప్పటివరకు 3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయని అధికారులు వెల్లడించారు. 65శాతంపైగా పెండింగ్ చలాన్లు క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
- Advertisement -