Monday, January 20, 2025

ట్రాఫిక్ గగ్గోలు.. గుర్తించే మీటర్లు

- Advertisement -
- Advertisement -

రోడ్లపై వాహనాల గగ్గోలును అంటే భయంకర శబ్ద కాలుష్యాన్ని అరికట్టడానికి అమెరికా లోని ప్రధాన నగరాల్లో అత్యంత ఆధునిక పద్ధతులు వినియోగిస్తున్నారు. దీనికోసం ట్రాఫిక్ కెమెరాలకు సౌండ్‌మీటర్లు అమర్చుతున్నారు. ఇవి వాహనాల నుంచి వచ్చే భీకర శబ్దాన్ని గుర్తిస్తాయి. ఆయా శబ్దాలు ఎంత స్థాయిలో ఉన్నాయో పడికడతాయి. వీటి ఆధారంగా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా భారీ శబ్దాలు కలిగించే ఆ వాహన యజమానులకు జరిమానా విధిస్తారు.

న్యూయార్క్ సిటీలో వాహనాల నుంచి వచ్చే శబ్దాలు భరించలేం. జాక్‌హామర్స్, హోంకింగ్ కార్స్, ట్రక్స్ శబ్దాలు ఎంతో పెద్దవిగా ఉంటాయి. ఈ శబ్దాలను చాలా వరకు తగ్గించడానికి ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా లో భయంకరమైన వాహనాల శబ్దాలు వెలువడే నగరాల్లో న్యూయార్క్ ఒకటి. ఇక్కడ గత వసంత కాలం నుంచి స్టాప్ లౌడ్ అండ్ ఎక్సెసివ్ ఎగ్జాస్ట్ పొల్యూషన్ యాక్ట్ అంటే భారీ శబ్ద కాలుష్యాన్ని అరికట్టే చట్టాన్ని అమలు చేస్తున్నారు. అమలు చేస్తున్న సాధనాలు శబ్దాన్ని పసిగట్టడమే కాకుండా అక్రమ వాహనదారుల లైసెన్స్ ప్లేట్లను కూడా గుర్తించి పోలీసులకు అప్పచెబుతాయి.

ఈమేరకు ఎవరైనా దొరికితే మొదటి తప్పు కింద 800 డాలర్లు అపరాధ రుసుంగా చెల్లించవలసి వస్తుంది. అప్పటికీ అతిక్రమిస్తే మూడో నేరం కింద 2625 డాలర్లను పెనాల్టీ కింద చెల్లించక తప్పదు. అయితే ఈ వాహనాల శబ్దాలను పట్టుకోడానికి ఎక్కడ రాడార్లు అమర్చారో సిటీ అధికార్లు బయటపెట్టడం లేదు. ఇప్పటివరకు అతిశబ్దం పుట్టించే డ్రైవర్లుగా71 మందికి పెనాల్టీ చలానాలు జారీ చేశారు.

ఏడాది క్రితం యూరప్ లోని ప్యారిస్ నగరంలో ఇలాంటి వ్యవస్థలను అమలు లోకి తీసుకు వచ్చారు. దశాబ్దం క్రితం న్యూయార్క్ మాజీ మేయర్ బ్లూమ్‌బెర్గ్ శబ్ద కాలుష్యంపై యుద్ధాన్ని ప్రకటించారు. 45 పేజీల నిబంధనలను విడుదల చేశారు. మితిమీరిన శబ్దకాలుష్యం వల్ల అంటే 120 డెసిబుల్స్ వరకు శబ్దం ఉంటే మొట్టమొదట చెవుల కర్ణభేరీలు దెబ్బతింటాయి. వినికిడిని గ్రహించే జ్ఞానం పోతుంది. సాధారణంగా మోటార్ సైకిలు స్పీడ్‌గా ఎక్కువ శబ్దంతో వెళ్తే 95 డెసిబుల్స్ స్థాయిలో శబ్దం వస్తుంది. కనీసం 70 డెసిబుల్స్ శబ్దం ఉన్నా చెవులు దెబ్బతింటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News