Wednesday, January 22, 2025

నిజాయితీని చాటుకున్న మహిళా ట్రాఫిక్ పోలీస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  ట్రాఫిక్ పోలీస్ మరోసారి నిజాయితీని చాటుకున్నారు. గురువారం మలక్‌పేట ట్రాఫిక్ మహిళా కానిస్టేబుల్ జి.మమత, హోమ్ గార్డ్ ఎ. దాసుతో కలిసి దిల్‌సుఖ్‌నగర్ ట్రాఫిక్ పాయింట్ సమీపంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇదేక్రమంలో సాయంత్రం 6.30 గంటల సమయంలో రోడ్డుపై ఓ వాలెట్ (పర్సు) పడి ఉండడాన్ని కానిస్టేబుల్ మమత గుర్తించారు. దానిని తెర్చి చూడడంతో అందులో రూ. 33 వేల నగదు ఉండడంతో వెంటనే మలక్‌పేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్‌కుకు సమాచారం అందించారు. ఒక గంట తర్వాత పార్సు పొగొట్టుకు న్న ఓవ్యక్తి వచ్చి వెతుకుతుండగా మహిళా కానిస్టేబుల్ మమత వారిని పిలిచి- నగదు ఉన్న పర్సును మలక్ పేట ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సమక్షంలో అందజేసి అందరి ప్రశంసలను అందుకున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ డిసిపి డి.శ్రీనివాస్ ట్రాఫిక్ సిబ్బందిని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News