Sunday, January 19, 2025

నిజాయితీని చాటుకున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః విధు నిర్వహణలో ఓ ఉన్న పోలీసు మానవత్వంతో పాటు నిజాయితీని చాటుకున్నారు. ట్రాఫిక్ హెడ్ కానిస్టబుల్ ఇ. సుధాఖర్‌రెడ్డి గురువారం దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తా వద్ద విథులు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో రోడ్ పైన ఓ పర్సు పడి ఉంది. ఆ పర్సును గమనించిన సుధాకర్‌రెడ్డి దానిని తెరిచి చూడడంతో అందులో (రూ.4వేలు) నగదు, ఒక గోల్ కాయిన్, మొత్తం విలువ (రూ.25వేలు)తో పాటు ATM కార్డ్ , పాన్ కార్డ్ మొదలైనవి ఉన్నాయి.

దీంతో పర్సును జాగ్రత్త పరిచి వెంటనే పర్సు లో లభించిన ఫోన్ నంబర్ ఆధారంగా విచారించడంతో ఓ మహిళదని తేలింది. దీంతో ఆమెను వెంటనే పిలిపించి ఆ పర్సును అందజేశారు. మధ్య తరగతి కి చెందిన ఆ మహిళ ఎంతో ఉద్వేదబరితంగా సంతోషాన్ని వెలిబుచ్చుతూ ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అక్కడే ఉన్న పలువురు ముఖ్యంగా విద్యార్థులు ట్రాఫిక్ పోలీసుల నిజాయితీని మెచ్చుకుని చప్పట్లతో ఆయన అభినంధనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News