Sunday, November 24, 2024

ఎసిబి వలలో ట్రాఫిక్ కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

డిడి కేసులో బైక్ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్
రూ.5వేలు తీసుకుండగా పట్టుకున్న ఎసిబి అధికారులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుకున్న బైక్‌ను ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఎసిబి అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారుల కథనం ప్రకారం… నారాయణగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎండి ఖాజా హబీబుద్దిన్‌ను పట్టుకున్నారు.

వాహనాన్ని సీజ్ చేసి కోర్టులో హాజరుపర్చగా, ఖాజా హబీబుద్దిన్‌కు జరిమానా విధించడంతో దానిని చెల్లించాడు. తర్వాత బైక్‌ను ఇవ్వాల్సింగా ట్రాఫిక్ కానిస్టేబుల్ వికాస్ కుమార్ యాదవ్‌ను సంప్రదించాడు. బైక్ ఇవ్వాలంటే రూ.5,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు బాధితుడు కానిస్టేబుల్ వికాస్ కుమార్ యాదవ్‌కు డబ్బులు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో అరెస్టు చేసి ఎసిబి కోర్టులో హాజరుపర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News