Monday, January 20, 2025

యువతిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన యువతిని కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సైబరాబాద్ సిపి అభినందించి రివార్డు అందజేశారు. రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రమేష్ విధినిర్వహణలో భాగంగా ఈ నెల 24వ తేదీన రాత్రి 8.30 గంటలకు హిమాయత్‌సాగర్ సర్వీస్ రోడ్డు వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ మహిళా అనుమానస్పదంగా కన్పించింది. వెంటనే ఆమెను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది.

కొంచెం ముందుకు వెళ్లిన రమేష్ అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూడగా మహిళా నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంనేందుకు యత్నించింది. వెంటనే అప్రమత్తమైన కానిస్టేబుల్ రమేష్ నీటిలో దూకి మహిళను కాపాడాడు. విషయం రాజేంద్రనగర్ పోలీసులకు చెపాడు. కార్యక్రమంలో ట్రాఫిక్ జాయింట్ సిపి నారాయణ్ నాయక్, ఇన్స్‌స్పెక్టర్ శ్యామ్ సుందర్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News