- Advertisement -
కరెంట్ షాక్‌తో వ్యక్తి విలవిల
సీపీఆర్ ద్వారా ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
హైదరాబాద్ : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఎలక్ట్రిక్ ప్యూజ్ బాక్కు తెరిచి చేతులు పెట్టాడు. దీంతో ఆ వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురై విలవిలలాడిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్రమత్తమై అతన్ని పక్కకు లాగేశాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఈ వ్యక్తికి కానిస్టేబుల్ బోలా శంకర్ సీపీఆర్ నిర్వహించి ప్రాణాలు కాపాడారు.
ఈఘటన బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్ సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఆర్ నిర్వహించడంతో ఆవ్యక్తి స్పృహలోకి వచ్చాడు. అనంతరం ఆవ్యక్తిని 108లో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సీపిఆర్ ద్వారా బాధిత వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ శంకర్‌పై బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నరసింహరాజుతో పాటు అధికారులు ప్రశంసలు వర్షం కురిపించి అభినందించారు.
- Advertisement -