Monday, January 20, 2025

ఆస్తిలో వాటా ఇవ్వాలని మామ పై దాడికి పాల్పడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

- Advertisement -
- Advertisement -

ఆస్తిలో వాటా ఇవ్వాలని మామపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడికి పాల్పడిన సంఘటన లంగర్‌హౌస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లంగర్‌హౌస్‌కి చెందిన కానిస్టేబుల్ ఎండి షాహిద్ ఖాన్ అనే వ్యక్తి గత కొద్దీ రోజులుగా మామ ఆస్తిలో తనకు కూడా వాటా ఇవ్వాలంటూ ఇందిరానగర్‌లో ఉంటున్న మామ అబ్దుల్ వాహిద్‌పై దాడికి పాల్పడ్డాడు. తనకి ఆస్తిలో వాటా ఇవ్వకపోతే మామ కుటుంబ సభ్యులందరి అంతు చూస్తానాంటూ బెదిరింపులకి పాల్పడ్డాడు. తనను ఎవరు ఏమి చేయలేరంటూ మామ కుటుంబం షాహిద్‌ఖాన్‌పై చిందు లేశారు. తమకు కానిస్టేబుల్ షాహిద్ నుంచి ప్రాణ హాని ఉందంటూ బాధితుడు అబ్దుల్ మోహిద్ జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేశాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News