Saturday, November 9, 2024

దారులన్నీ ఆంధ్రా వైపే

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : నగరం లో ఉన్న ఆంధ్ర ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందు కు ప్రజలు వారి సొంత గ్రామాల బా టపట్టారు. దీంతో ఒక్కసారిగా టోల్‌ప్లాజాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద రద్దీ నెలకొంది. సరిపడా బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం వైపు వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిపోయాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచీగూడ రైల్వేస్టేషన్లు జనసంద్రందా మారాయి.

టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ
ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు స్వస్థలాలకు తరలి వెళ్తుండటంతో పంతంగి టోల్‌ప్లాజా వద్ద విపరీతమైన రద్దీ ఉంది. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా, ఓటేసేందుకు ఏపీకి వెళుతుండటంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ముఖ్యంగా సొంత వాహనాల్లో వెళ్లేవారితో హైదరాబాద్- విజయవాడ హైవేపై పలుచోట్ల ట్రాఫిక్‌జామ్ అవుతోంది. వీకెండ్ కావడం, పోలింగ్‌కు కేవలం రెండు ఒకరోజే సమయం ఉండటంతో నగర జనాభా ఎపి వైపు పరుగులు తీస్తోంది. దీంతో భారీ రద్దీ నెలకొంది. పలు చోట్ల నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి. దీంతో హైదరాబాద్ శివారు ప్రాంతమైన హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. చౌటుప్పల్‌లోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి.

ప్రైవేటు ట్రావెల్స్‌కు మూడు రెట్ల ఛార్జీ
ఎపి ఓటర్లు సొంతూళ్లకు వెళ్లే వారికి ప్రయాణం కష్టతరంగా మారింది. ముందుగా బుక్ చేసుకుందామనుకున్నప్పటికీ అప్పటికే బస్సు టికెట్లు బుక్ అయి ప్రస్తుతం ఏదో విధంగా వెళ్దామని బస్సులు, రైళ్లు వద్దకు చేరుకుంటున్నారు. ప్రైవేటు బస్సులైతే ఏకంగా 3 రెట్లు ఎక్కువగా ఛార్జీని వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఓటు వేసేందుకు తమతమ సొంత ఊళ్లకు వెళ్తున్న ప్రయాణికులతో బస్టాండ్‌లు అన్నీ రద్దీగా మారిపోయాయి. ఎల్‌బి నగర్‌లోని విజయవాడ జాతీయ రహదారి బస్టాండ్ వద్ద ఆర్‌టిసి బస్సులు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News