సిటిబ్యూరోః దుర్గా మాత విగ్రహాల నిజ్జనం కోసం హుస్సేన్ సాగర్‌కు వాహనాలను క్యూ కట్టడంతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. దేవినవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేశారు. చివరి రోజు కావడంతో భక్తులు దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు హుస్సేన్‌సాగర్‌కు భారీగా తరలివచ్చాయి. దీంతో సెక్రటేరియట్ రోడ్డు, నెక్లెస్ రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్, టెలిఫోన్ భవన్ రోడ్డు వరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి.
దీంతో ట్యాంక్‌బండ్ పరిసరాల నుంచి వెళ్తున్న వాహనదారులు గంటల కొద్ది ట్రాఫిక్‌లో ఇరుక్కు పోవడంతో ఇబ్బంది పడ్డారు. దుర్గా మాత నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్ చుట్టూ 11 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి కొనసాగుతున్న దుర్గా మాత నిజమ్జనం కార్యక్రమాలు గురువారంతో ముగియనుంది. ట్రాఫిక్‌ను ముందుగానే ఊహించిన పోలీసులు ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయినా కూడా పోలీసులు ఊహించిన దానికంటే ఎక్కువగా దుర్గామాత విగ్రహాలు రావడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది.