Monday, December 23, 2024

ట్రాఫిక్‌లో చిక్కుకున్న విఐపిలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఎల్‌బి స్టేడియంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో దాని పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో పలువురు విఐపిలు ఇబ్బందులు పడ్డారు. ఈ బాధితుల్లో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, గవర్నర్ తమళిసై కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు వచ్చిన కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను శంషాబాద్ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో ఎల్‌బి స్టేడియానికి తీసుకుని వస్తున్నారు.

ఈ క్రమంలోనే రేవంత్‌రెడ్డి, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ కలిసి ఒకే కారులో బంజారాహిల్స్ తాజ్‌కృష్ణ హోటల్ నుంచి ఎల్‌బి స్టేడియానికి వస్తున్నారు. దీంతో అంసెబ్లీ వద్ద పోలీసులు ట్రాఫిక్ నిలిపి వేశారు. అదే సమయంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కాన్వాయ్ రవీంద్రభారతి కూడలికి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి కాన్వాయ్ కోసం సిద్దరామయ్య కాన్వాయ్‌ను ఆపివేశారు. దీంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. వీరే కాకుండా ప్రామాణ స్వీకారానికి భారీ ఎత్తున ప్రజలు తరలిరావడంతో ఎల్‌బి స్టేడియం పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.

ఆంక్షలు విధించినా…
ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్‌బి స్టేడియంలో గురువారం ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందుగానే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొన్ని రోడ్లను మూసివేశారు, వాహనదారులు ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని ముందుగానే కోరారు. ప్రమాణ స్వీకారానికి భారీగా ప్రజలు తరలిరావడంతో వారి వాహనాలతో నగర రోడ్లు కిక్కిరిసాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. స్టేడియం కెపాసిటీ సరిపోకపోవడంతో చాలామంది బయటే నిలుచున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News