Wednesday, January 22, 2025

రుద్రారం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్

- Advertisement -
- Advertisement -

Traffic jam on Rudraram National Highway

సంగారెడ్డి: జిల్లాలోని రుద్రారం వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రుద్రారం వద్ద పలు వాహనాలు ఢీకొని ట్రాఫిక్ స్తంభించింది. సంగారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు రాంగ్ రూట్ లో కారు వెళ్తూ ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఎదురుగా వస్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో వరుసగా వాహనాలు ఢీకొన్నాయి. లారీ, 3 వ్యాన్లు, 4 కార్లు వరుసగా ఒకదానికొకటి ఢీకొట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో జహీరబాద్, షోలాపూర్ నుంచి వచ్చే మార్గాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి కర్నాటక, మహారాష్ట్ర వైపు వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ ఏర్పడింది. రాంగ్ రూట్ లో వెళ్తున్న కారులో ఎయిర్ బెలూన్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News