Thursday, January 23, 2025

ఆ మూడు రోజుల పాటు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద రాకపోకలు బంద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దుర్గం చెరువు కేబుల్ బిడ్జ్రి నిర్వహణ పనుల నేపథ్యంలో బ్రిడ్జి మీదగా మూడు రోజుల పాటు రాకపోకలను నిలిపివేస్తున్న జిహెచ్‌ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ వెల్లడించారు. ఈనెల 6 వ తేదీ ఆర్థరాత్రి 12 గంటల నుంచి 10 తేదీ ఉదయం 6 గంటల వరకు మూడు రోజుల పాటు కేబుల్ బ్రిడ్జిను మూసి వేస్తున్నమన్నారు. కేబుల్ బ్రిడ్జి నిర్వహణ మ్యానువల్ ప్రకారం ఇంజనీర్ల బృందం నిర్దిష్ట తనిఖీ పనుల్లో భాగంగా భారీ క్రేన్లను ఉపయోగించనున్న నేపథ్యంలో ఈ మూడు రోజుల పాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. అదేవిధంగా మూడు రోజుల పాటు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని మూసివేస్తుండడంతో సైబరాబాద్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం – 45 – మార్గంలో ప్రయాణించే ప్రయాణికులందరూ ఈ ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకుని ట్రాఫిక్ సజావుగా సాగేలా సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు.

ప్రత్యామ్నాయ మార్గాలు 

రోడ్ నెం.45 నుండి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వద్ద రోడ్డు నెం 45 కుడివైపు మలుపు తీసుకుని -మాదాపూర్ పోలీసు సేష్టన్ వైపు – ఎడమ మలుపు -తీసుకుని సిఓడి జంక్షన్ – సైబర్ టవర్లు – ఎడమ వైపు మలుపు తీసుకుని లెమ్మన్ ట్రీ జంక్షన్ – మీదగా ఐకియా రోటరీ మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.
రోడ్డు నెం.45 నుండి వయా కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్ రోడ్డు నెం.45లోని డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వద్ద మళ్లించనున్నారు.

అక్కడి నుంచి – డి-మార్ట్ ముందు ఎడమ మలుపు తీసుకుని — నెక్టార్ గార్డెన్ కాలనీ – కుడి మలుపు -తీసుకుని నెక్టార్ గార్డెన్ జంక్షన్ – ఎడమవైపు మలుపు తీసుకని – దుర్గం చెరువు – I ల్యాబ్స్ యూ టర్న్ ద్వారా ఐటిసి కోహినూర్ – మై హోమ్ అబ్రా జంక్షన్ – సి గేట్ జంక్షన్ – ఐక్యా రోటరీ – లెఫ్ట్ టర్న్ – బయో డైవర్సీటి జంక్షన్ ఐకియా రోటరీ మార్గం వెళ్లాలి
కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్ ఇన్-ఆర్బిట్ మాల్ వద్ద మళ్లించున్నారు. ఇన్-ఆర్బిట్ మాల్ – ఎడమ మలుపు – ఐ-ల్యాబ్స్ – దుర్గం చెరువు – నెక్టర్ గార్డెన్ జంక్షన్ – కుడి మలుపు -ద్వారా డాక్టర్స్ కాలనీ – కుడి మలుపు ద్వారా – డి -మార్ట్ – వద్ద యు టర్న్ – వైపు మళ్లిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News