Sunday, January 19, 2025

నిజాయితీ రాస్తాలో ట్రాఫిక్ పోలీస్

- Advertisement -
- Advertisement -

Traffic police finds bag with Rs 45 lakh, hands it over at police station

దొరికిన రూ 45 లక్షల బ్యాగ్ అప్పగింత

రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో ఓ ట్రాఫిక్ పోలీసు రోడ్డుపై తనకు దొరికిన రూ 45 లక్షల నగదుతో కూడిన బ్యాగ్‌ను స్థానిక పోలీసుస్టేషన్‌లో అప్పగించారు. డబ్బుజాంలు, ఆశలరణగొణధ్వనుల లోకంలో తన నిజాయితీని నిశ్శబ్ధంగా చాటుకున్నారు. నవా రాయ్‌పూర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలంబెర్ సిన్హా విధులలో ఉండగా రోడ్డుపై పడి ఉన్న బ్యాగ్ కనపడింది. దీనిని తీసి చూడగా ఇందులో రూ 45 లక్షల మేర నోట్ల కట్టలు ఉన్నాయి. అయితే వీటిని కానిస్టేబుల్ పోలీసులకు అప్పగించినట్లు అదనపు ఎస్‌పి సుఖనందన్ రాథోడ్ తెలిపారు. ఈ బ్యాగ్‌లో అన్ని రూ 2000, రూ 500 నోట్లు ఉన్నాయని , ఈ బ్యాగ్‌ను అప్పగించి ఈ పోలీసు తన గొప్ప మనసును చాటుకున్నారని ప్రశంసించారు. రాయ్‌పూర్‌లో ఈ బ్యాగ్ దొరికిన కానిస్టేబుల్ అందరి నోటా మాటయ్యారు. ఇప్పుడు ఇంతకూ ఈ నగదు బ్యాగ్ ఎవరిదీ? రోడ్డుపైకి ఎందుకు చేరింది? అనేది కనుగొనేందుకు దర్యాప్తు సాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News