మనతెలంగాణ, హైదరాబాద్ : పోలీసులు మరోసారి గ్రీన్ ఛాన్ ఏర్పాటు చేసి మానవ అవయవాల తరలింపుకు ఎలాంటి ఆటంకం కలుగకుండా బుధవారం ఏర్పాట్లు చేశారు. ఎల్‌బి నగర్‌లోని కామినేని ఆస్పత్రి నుంచి గుండెను జూబ్లీహిల్స్‌లోని కామినేని ఆస్పత్రి తరలించేందుకు ట్రాఫిక్‌ను నిలిపివేశారు. రాచకొండ ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని అంబులెన్స్‌ను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్‌కు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూశారు. ఎల్బీ నగర్ నుంచి జూబ్లీహిల్స్ వరకు ఉన్న 30 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 27 నిమిషాల్లో చేరుకోగలిగింది. ఉదయం 9.18గంటలకు బయలు దేరిన వాహనం 9.45గంటలకు అపోలో ఆస్పత్రికి చేరుకుంది. కామినేని ఆస్పత్రి నుంచి మరో అంబులెన్స్‌లో ఊపిరితిత్తులను తీసుకుని బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఉదయం 9.36 గంటలకు ఎల్‌బి నగర్ నుంచి బయలు దేరిన అంబులెన్స్ 9.54 గంటలకు నిమ్స్‌కు చేరుకుంది. అంబులెన్స్‌కు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు. అంబులెన్స్‌ల కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన పోలీసులకు వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు.