Saturday, November 16, 2024

ఎల్‌బి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ప్రధాని నరేంద్రమోడీ పర్యటన నేపథ్యంలో ఎల్‌బి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. బిజేపి ఎన్నికల్లో భాగంగా ఎల్‌బి స్టేడియంలో పబ్లిక్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.
ఎఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుంచి బిజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను నాంపల్లి లేదా రవీంద్రభారతి మీదుగా మళ్లిస్తారు.
అబిడ్స్, గన్‌ఫౌండ్రీ నుంచి వచ్చే వాహనాలను బిజేఆర్ విగ్రహం వైపు అనుమతించరు. ఎస్‌బిఐ గన్‌ఫౌండ్రీ మీదుగా చాపెల్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
ట్యాంక్‌బండ్ నుంచి బషీర్‌బాగ్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను లిబర్టీ జంక్షన్ మీదుగా హిమాయత్‌నగర్ వైపు మళ్లిస్తారు.

పార్కింగ్ ప్రాంతాలు…
సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ , అంబేద్కర్ విగ్రహం, లిబర్టీ, బషీర్‌బాగ్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఆయకార్ భవన్‌లోని పార్కింగ్ ప్రాంతంలో పెట్టాలి.
మెహిదీపట్నం నుంచి నిరంకారి, ఓల్డ్ సైఫాబాద్ పిఎస్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, హెచ్‌టిపి జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు పబ్లిక్ గార్డెన్‌లో పార్కింగ్ చేయాలి.
ఎల్‌బి నగర్, దిల్‌సుక్‌నగర్, హెచ్‌టిపి వచ్చే వాహనాలను పబ్లిక్‌గార్డెన్, నిజాం కాలేజీలో పార్కింగ్ చేయాలి.
ముషీరాబాద్, అమీర్‌పేట, హిమాయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలను నిజాం కాలేజీ గ్రౌండ్‌లో పార్కింగ్ చేయాలి.
విఐపిలు తమ వాహనాలను టెన్నీస్ కోర్టులో పార్కింగ్ చేయాలి.
మీడియా వాహనాలను నిజాం కాలేజీ మొదటి గేట్, మహబూబియా కాలేజీలో వాహనాలను పార్కింగ్ చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News