Thursday, January 23, 2025

దుర్గామాత విగ్రహాల నిమజ్జనం..సంజీవయ్య పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ఎన్‌టిఆర్ మార్గ్, గార్డెన్ పాయింట్, బేబీ పాడ్స్, జలవిహార్, సంజీవయ్య పార్క్ పరిసరాల్లో ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని పోలీసులు కోరారు.

వివి స్టాట్యూః పంజాగుట్ట నుంచి రాజ్‌భవన్ మీదుగా ఖైరతాబాద్ ఫ్లైఓవఱ్ నుంచి వెళ్లే వాహనాలను వివి స్టాట్యూ మీదుగా షాదన్, నిరంకారి వెపు వెళ్లాలి.
సైఫాబాద్ ఓల్డ్ పిఎస్‌ః నిరంకారి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ మీదుగా వెళ్లే వాహనాలను సైఫాబాద్ ఓల్డ్ పిఎస్ మీదుగా రవీంద్రభారతి వైపు వెళ్లాలి. దుర్గామాత విగ్రహాలు ఇక్బాల్ మినార్ రోడ్డు వైపు అనుమతించరు.
హెచ్‌టిపి, సైఫాబాద్ ఓల్డ్ పిఎస్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు వెళ్లే వాహనాలను రవీంద్రభారతి మీదుగా లకిడికాపూల్, హెచ్‌టిపి వైపు వెళ్లాలి.
తెలుగుతల్లి ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్‌ః ఇక్బాల్‌మినార్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వయా తెలుగుతల్లి జంక్షన్ వెళ్లే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ స్టార్టింగ్ నుంచి కట్టమైసమ్మ వైపు వెళ్లాలి.
అంబేద్కర్ స్టాట్యూ నుంచి వచ్చే వాహనాలను ఎన్‌టిఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
మినిస్టర్ రోడ్డు, రాణిగంజ్ మీదుగా పివి మార్గ్, నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలు నల్లగుట్ట బ్రిడ్జి మీదుగా రాణిగంజ్, మినిస్టర్ రోడ్డు వైపు వెళ్లాలి.
బుద్ధభవన్ నుంచి నల్లగుట్ట బ్రిడ్జి , పివి మార్గ్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించర. మజీద్ సోనాబి అబ్దుల్లా మీదుగా మినిస్టర్ రోడ్డు వయా రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
నాంపల్లి, హెచ్‌టిపి నుంచి బిజేఆర్ సర్కిల్ వైపు వెళ్లే వాహనాలను ఎఆర్ పెట్రోల్ పంప్ మీదుగా రవీంద్రభారతి, ఎంజే మార్కెట్ వైపు వెళ్లాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News