Wednesday, January 22, 2025

22న ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

అమర వీరుల స్మృతివనం ప్రారంభం
ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
ఆదేశాలు జారీ చేసిన ట్రాఫిక్ అదనపు కమిషనర్ సుధీర్‌బాబు

హైదరాబాద్: ఈ నెల 22వ తేదీన ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్‌బాబు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమలులో ఉండనున్నట్లు తెలిపారు. వాహనదారులు ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

వివి స్టాట్యూ, నెక్లెస్ రోటరీ, ఎన్‌టిఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వైపు వాహనాలకు అనుమతిలేదు.
ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను వివి స్టాట్యూ మీదుగా షాదన్, నిరంకారీ వైపు మళ్లిస్తారు. నిరంకారి, చింతల్‌బస్తీ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి అనుమతించరు.

ఇక్బాల్‌మినీర్ జంక్షన్ నుంచి ఎన్‌టిఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ వెళ్లే వాహనాలను తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద మళ్లిస్తారు.
బుద్ద భవన్ నుంచి నెక్లెస్ రోటరీ, ఎన్‌టిఆర్ మార్గ్ వైపు వాహనాలను అనుమతించరు. నల్లగుట్ట ఎక్స్ రోడ్డు వద్ద మళ్లిస్తారు.
లిబర్టీ, అంబేద్కర్ స్టాట్యూ నుంచి ఎన్‌టిఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు. ఇక్బాల్ మినార్ జంక్షన్ వద్ద మళ్లిస్తారు.రాణిగంజ్, కర్బాలా, కవాడిగూడ నుంచి ట్యాంక్‌బండ్‌వైపు అనుమతించరు.

బిఆర్‌కెఆర్ భవన్ నుంచి ఎన్‌టిఆర్ మార్గ్ వైపు వాహనాలను అనుమతించరు. ఇక్బాల మినార్ జంక్షన్ వైపు మళ్లిస్తారు.
బడాగణేష్ నుంచి ఐమ్యాక్, నెక్లెస్ రోటరీ మీదుగా వెళ్లే వాహనాలను బడాగణేష్ మీదుగా రాజ్‌దూత్ లేన్ వైపు మళ్లిస్తారు.
ఎన్‌టిఆర్ గార్డెన్, ఎన్‌టిఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్క్ రోడ్లను మూసివేస్తారు.
సికింద్రాబాద్ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వాహనాలను అనుమతించరు. లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి సేయిలింవ క్లబ్ వైపు మళ్లిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News