Friday, December 20, 2024

ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

4న ఉప్పల్ స్టేడియలంలో ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్
ఆదేశాలు జారీ చేసిన సిపి డిఎస్ చౌహాన్

హైదరాబాద్: ఈ నెల 4వ తేదీన ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్న ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేడియం పరిసరాల్లో ఆంక్షలు విధిస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 4వ తేదీన మద్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. సర్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కటా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు, రోడ్లమూసివేత తదితర చర్యలు తీసుకోనున్నారు. ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వాహనదారులు వెళ్లాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News