Wednesday, January 1, 2025

ప్రధాని మోడీ పర్యటన.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః శనివారం నగరానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సికింద్రాబాద్ లో ప్రధాని మోడీ, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ రోజు మోడీ పర్యటన దృష్ట్యా బేగంపేట, సికింద్రాబాద్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

సికింద్రాబాద్ ప్రాంతంలోని కొన్ని రోడ్లు మూసివేయనున్నట్లు డిజిపి తెలిపారు. దారి మళ్లించే మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని, వాహన దారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. బహిరంగ సభ జరగనున్న పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News