హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆవిష్కరించనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్ మార్గంలో టాఫ్రిక్ ఆంక్షలు విధించారు. నెక్లెస్ రోడ్డు, ఎన్‌టిఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలకు ప్రవేశం లేదు. పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలను షాదన్ కాలేజ్ మీదుగా మళ్లించారు. సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్‌టిఆర్ మార్గ్ ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలు రాణిగంజ్ మీదుగా మళ్లించారు. లక్డీకాపూల్ నుంచి ట్యాంక్‌బండ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు తెలుగు తల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లించారు. ఎన్‌టిఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలు లక్డీకపూల్ వైపు మళ్లించారు. ఎన్‌టిఆర్ గార్డెన్, ఎన్‌టిఆర్ ఘాట్, లుంబినీ పార్క్, మింట్ కంపౌండ్, నెక్లెస్ రోటరీ మార్గాలను మూసివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
Also Read: జ్ఞానజ్యోతులు వెలిగించిన విశ్వమానవుడు