Wednesday, January 22, 2025

బాపూఘాట్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -
Traffic restrictions at Bapu Ghat
నేడు గాంధీ వర్ధంతి, నివాళులర్పించనున్న సిఎం కెసిఆర్

హైదరాబాద్: మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ సమీపంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర ట్రాఫిక్ జాయంట్ కమిసనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన మహా త్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బాపూఘాట్‌లో నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 1౦ గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు బాపూఘా ట్, లంగర్‌హౌస్, నానల్ నగర్, ఆంధ్రా ఫ్లోర్ మిల్, లంగర్‌హౌస్, సంగం బస్ స్టాప్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News