Monday, December 23, 2024

ఛేనంబర్ జంక్షన్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో: అబంర్‌పేట ఫ్లైఓవర్ పనుల కారణంగా చేనంబర్ జంక్షన్, అంబర్ పేట టీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గంలో వెళ్లాలని కోరారు. ఉప్పల్ నుంచి 6వ నంబర్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను అంబర్‌పేట టీ జంక్షన్, ఆలీ కేఫ్ ఎక్స్ రోడ్డు, జిందాతిలిస్మాత్,గోల్నాక జంక్షన్, నిబంబోలి అడ్డా, చాధర్‌ఘాట్ వైపు వెళ్లాలి. చాదర్‌ఘాట్ జంక్షన్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే వాహనాలు చాదర్‌ఘాట్ నుంచి 6వ నంబర్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు గోల్నాక జంక్షన్, గోల్నాక న్యూబ్రిడ్జి లెఫ్ట్ టర్న్, జిందాతిలిస్మాత్ రోడ్డు, ఆలీ కేఫ్ ఎక్స్ రోడ్డు, అంబర్‌పేట టి జంక్షన్ రైటర్న్, రాయల్ జ్యూస్, ఉప్పల్ వైపు వెళ్లాలి.

తిలక్‌నగర్ నుంచి 6వ నంబర్ జంక్షన్‌వైపు వెళ్లే వాహనాలు తిలక్‌నగర్ జంక్షన్, శివం రోడ్డు, సాయిబాబా టెంపుల్ రోడ్డు, రెడ్ బిల్డింగ్, రాయల్ జ్యూస్ లెఫ్ట్ టర్న్, రామంతపూర్, ఉప్పల్ వెళ్లాలి. దిల్‌సుక్‌నగర్ నుంచి 6వ నంబర్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలు అంబర్‌పేట టి జంక్షన్ వద్ద రైటర్న్ తీసుకుని, రాయల్ జ్యూస్, రెడ్ బిల్డింగ్, సాయి బాబా టెంపుల్, శివం రోడ్డు లెఫ్ట్ టర్న్ తీసుకుని తిలక్‌నగర్ వెళ్లాలి. ఆర్‌టిసి బస్సులు, భారీ వాహనాలు చాదర్‌ఘాట్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లేవి చాదర్‌ఘాట్, నింబోలి అడ్డా, టూరిస్ట్ జంక్షన్, బర్కత్‌పుర, పీవర్ ఆస్పత్రి, విద్యానగర్, అడిక్‌మెట్ ఫ్లైఓవఱ్, తార్నాక, హబ్సీగూడ, ఉప్పల్‌కు వెళ్లాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News