Monday, December 23, 2024

గాంధీ ఆస్పత్రి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Traffic restrictions at Gandhi Hospital

సిఎం పర్యటన నేపథ్యంలో

మనతెలంగాణ, హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని సిఎం కెసిఆర్ ఆదివారం ప్రారంభించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. గాంధీ ఆస్పత్రి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 09 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు అమలులో ఉంటాయని హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఎవి రంగనాథ్ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పనెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

సెయింట్ జాన్స్ రోటరీ, క్లాక్ టవర్ నుంచి వచ్చే వాహనాలను చిలకలగూడ ఎక్స్ రోడ్డు మీదుగా సంగీత్ ఎక్స్ రోడ్డు నుంచి ఆలుగడ్డబావి వైపు మళ్లిస్తారు. ఆలుగడ్డబావి నుంచి ముషీరాబాద్ వైపు వచ్చే వాహనాలు చిలకలగూడ ఎక్స్ రోడ్డు, సీతాఫల్‌మండి, వారసిగూడ, విద్యానగర్, నల్లకుంట వైపు మళ్లిస్తారు. ఆర్‌టిసి ఎక్స్ రోడ్డు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే వాహనాలను ముషీరాబాద్ ఎక్స్ రోడ్డు నుంచి కవాడిగూడ, ఆర్‌పి రోడ్డు వైపు మళ్లిస్తారు.

పార్కింగ్ ఏరియా…

ప్యారామౌంట్ అపార్ట్‌మెంట్ పార్కింగ్, బోయిగూడ ఎక్స్ వై జంక్షన్. ప్యారమౌంట్ అపార్ట్‌మెంట్ లేన్ గ్రేవ్ యార్డ్ రోడ్డు, బైక్‌లను వాటర్ బోర్డు ఆఫీస్ వద్ద పార్కింగ్ చేయాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News