Monday, December 23, 2024

ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -
Traffic restrictions at Tank Bund
ఆదేశాలు జారీ చేసిన జాయింట్ సిపి రంగనాథ్

హైదరాబాద్: అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. 13వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 14వ తేదీ 11గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. కట్టమైసమ్మ నుంచి అబేంద్కర్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్‌కు వచ్చే వాహనాలను తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు. చిల్డ్రన్స్ పార్క్ నుంచి వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం నుంచి డైవర్ట్ చేసి చిల్డ్రన్ పార్క్, డిబిఆర్ మిల్స్, కట్టమైసమ్మ, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఆర్‌టిసి ఎక్స్ రోడ్డు వైపు మళ్లిస్తారు. హిమాయత్ నగర్ నుంచి లిబర్టీ వైపు వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి బషీర్‌బాగ్ వైపు మళ్లిస్తారు. ఎన్టిర్ మార్గ్, ఇక్బాల్ మినార్ నుంచి లబర్టీ వైపు వచ్చే వాహనాలు అబేద్కర్ విగ్రహం వద్ద నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్ మీదుగా అబేద్కర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను లిబర్టీ మీదుగా హిమయత్ నగర్ వైపు మళ్లిస్తారు.

ఆర్టిసి బస్సుల మళ్లింపు…

నిరంకారీ భవన్, ఓల్డ్ సైఫాబాద్ పిఎస్ మీదుగా లిబర్టీ వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ మీదుగా రవీంథ్ర భారతీ, పిసిఆర్, బషీర్‌బాగ్ వైపు మళ్లిస్తారు.
రాణీగంజ్, కర్బాలా మైదాన్ నుంచి లీబర్టీ, బషీర్‌బాగ్ నుంచి వచ్చే వాహనాలను చిల్డ్రన్ పార్క్ మీదుగా డిబిఆర్ మిల్స్, కట్టమైసమ్మ టెంపుల్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఇందిరా పార్క్‌వైపు మళ్లిస్తారు.
పార్కింగ్ ప్రాంతాలు…
కార్లు, బైక్‌లను తెలుగుతల్లి స్లిప్ రోడ్డు, ఎన్టీఆర్ ఘాట్ వద్ద పార్కింగ్ చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News