Monday, December 23, 2024

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Traffic restrictions during Vice President Venkaiah Naidu's city visit

మనతెలంగాణ, హైదరాబాద్ : దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నగర పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఉపరాష్ట్రపతి పర్యటించే మార్గాల్లో గురువారం ట్రాఫిక్ మళ్లింపు లేదా ఆపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉదయం 9.35 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో రానున్నారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్29లోని నివాసానికి చేరుకుంటారు. పిఎన్‌టి ఫ్లైఓవర్, శ్యామ్‌లాల్ బిల్డింగ్, హెచ్‌పిఎస్ బేగంపేట, బేగంపేట ఫ్లైఓవర్, పంజాగుట్ట ఫ్లైఓవర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, రోడ్డు నంబర్29, జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News