ఆదేశాలు జారీ చేసిన నగర సిపి అంజనీకుమార్
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని వినతి
హైదరాబాద్: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించనున్న ప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. సయిద్ ఖాద్రీ చమన్, గులాం మూర్తజా కాలనీ నుంచి ర్యాలీ శంషీర్‌గంజ ఇంజన్ బౌలి వరకు ఉంటుంది. ఈ సమయంలో ట్రాఫిక్ ఎంబిఎన్‌ఆర్ ఎక్స్ రోడ్డు మీదుగా కందికల్‌గేట్, పిషాల్‌బండ, ఓల్డ్ కర్నూల్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
ర్యాలీ ఇంజన్‌బౌలికి రాగానే ట్రాఫిక్‌ను ఇంజన్‌బౌలి నుంచి గోషామహల్, సయిద్ ఖాద్రీ చమన్ రోడ్డువైపు మళ్లిస్తారు. నాగులచింత, చార్మినార్‌వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు.
ర్యాలీ సయిద్ ఖాద్రీ చమన్, గులాం ముర్తజా కాలనీ రాగానే ట్రాఫిక్‌ను గోషాలా నుంచి శంషేర్‌గంజ్, ఇంజిన్ బౌలి వైపు మళ్లిస్తారు. బహదూర్‌పుర మీదుగా కలాపత్తర్ వైపు అనుమతివ్వరు. కాలాపత్తర్ వై జంక్షన్ మీదుగా ఆలీ నగర్ జహనుమా వైపు మళ్లిస్తారు. ర్యాలీ శంషేర్ గంజ్ రాగానే ట్రాఫిక్‌ను చార్మినార్ వైపు అనుమతించరు. గోషాలా, కాలాపత్తర్, బహదూర్‌పుర వైపు మళ్లిస్తారు. ర్యాలీ శంషేర్ గంజ్‌కు రాగానే లాల్‌దర్వాజా మోడల్ రాగానే ట్రాఫిక్‌ను లాల్‌దర్వాజ టెంపుల్, చత్రినాఖవైపు మళ్లిస్తారు. ర్యాలీ లాల్‌దర్వాజాకు రాగానే ట్రాఫిక్‌ను డెక్కన్ హోటల్, అక్కన్నమాదన్న టెంపుల్ మీదుగా అశోక పిల్లర్, మహ్మద్ శుకోర్ మసీద్ మీదుగా మళ్లిస్తారు. నాగులచింత వెనుక నుంచి ట్రాఫిక్‌ను సుధా లైబ్రరీ, అశోక్ పిల్లర్, మహ్మద్ షుకోర్ మసీద్‌వైపు మళ్లిస్తారు. హిమ్మత్‌పుర రాజేష్ మెడికల్ హాల్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ట్రాఫిక్‌ను అక్కన్న మాదన్న టెంపుల్, వోల్గా హోటల్ ఖిలావత్ వైపు మళ్లిస్తారు. ఫతేదర్వాజ, ఖిలావత్ మీదుగా రాజేష్ మెడికల్ హాల్ వద్ద ట్రాఫిక్‌ను డైవర్ట్ చేసి వోల్గా హోటల్ మీదుగా ఫతేదర్వాజ, కిల్వాట్ మీదుగా మళ్లిస్తారు.
ర్యాలీ రాజేష్ మెడికల్ హల్, షాహిలిబండాకు రాగానే ట్రాఫిక్‌ను పంచమోహళ్ల మీదుగా షా ఫంక్షన్ హాల్ మీదుగా ఖిల్‌వాత్ రోడ్డు మీదుగా మళ్లిస్తారు. ర్యాలీ నారాయణ స్కూల్ చార్మినార్ వద్దకు రాగానే ట్రాఫిక్‌ను రాజేష్ మెడికల్ హాల్ మీదుగా ఖిల్‌వాత్, అక్కన్నమాదన్న టెంపుల్, మోఘల్‌పుర వైపు మళ్లిస్తారు. ర్యాలీ మక్కామసీద్ నుంచి ప్రారంభం కాగానే ట్రాఫిక్‌ను కాళాకామన్ మీదుగా గుల్జార్ హౌస్, అర్మాన్ హోటల్ మీదుగా ఈట్‌బార్ చౌక్ అనుమతించరు. షీర్ బతిల్ కమాన్ నుంచి గుల్జార్‌హౌస్ వచ్చే ట్రాఫిక్‌ను షీర్ బాటీల్ కమాన్ మీదుగా మీటికా షీర్, గన్సీ బజార్ మీదుగా మళ్లిస్తారు. ర్యాలీ చర్‌కమాన్‌కు చేరుకోగానే మదీన నుంచి చార్మినార్ వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు, మదీనా మీదుగా సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు. షేర్‌టన్ హోటల్ నుంచి మెయిన్ రోడ్డు, మచిలి కమాన్ వైపు అనుమతించరు. అగర్వాల్ కమాన్ నుంచి వచ్చే వాహనాలను ఆపివేస్తారు.
ర్యాలీ మచిలీ కమాన్‌కు రాగానే ఎంఎం సెంటర్ నుంచి అఫ్జల్ గంజ్ బ్రిడ్జివైపు మళ్లిస్తారు, నయాపూల్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు.ర్యాలీ ఎంఎం సెంటర్‌కు రాగానే చట్టాబజార్, టిప్పుకానా, దేవాన్ దేవ్‌డి కమాన్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు.ర్యాలీ పిస్తా హౌస్ నయాపూల్‌కు రాగానే ట్రాఫిక్‌ను ఆపివేస్తారు. ఎస్‌జే రోటరీ మీదుగా మదీన, చట్టాబజార్, దేవాన్ దేవ్‌డి వైపు మళ్లిస్తారు.ర్యాలీ నయాపూల్‌కు రాగానే ఎంజిబిఎస్ వద్ద ట్రాఫిక్‌ను డైవర్ట్ చేసి శివాజీ బ్రిడ్జి మీదుగా మళ్లిస్తారు, సాలార్‌జంగ్ మ్యూజియం, ఎస్‌జె రోటరీ, ఎపిఎటి వైపు అనుమతించరు.ర్యాలీ ఎంఎం సెంటర్‌కు రాగానే ఆర్టిసి బస్సులను చాదర్‌గట్ వైపు మళ్లిస్తారు, ఎస్‌జే రోటరీ, ఎంజిబిఎస్‌వైపు అనుమతిలేదు.ర్యాలీ సాలార్‌జంగ్ మ్యూజియంకు రాగానే ట్రాఫిక్‌ను అజంపుర, ఎంజిబిఎస్ మీదుగా చాదర్‌గట్‌వైపు మళ్లిస్తారు.ర్యాలీ ఎస్‌జే రోటరీకి రాగానే దబీర్‌పుర దర్వాజా నుంచి వచ్చే వాహనాలను ఎస్‌బిహెచ్ లేన్ మీదుగా హుడా ఆఫీస్, సక్సెస్ స్కూల్ నుంచి పురాణిహవేలి వైపు అనుమతించకుండా, గంగానగర్ నాలావైపు మళ్లిస్తారు.
ర్యాలీ దారుసలాం రాగనే పురాణహవేలి, ఎపిఎటి మీదుగా ఈటాబార్‌చౌక్ మీదుగా యాకత్‌పుర, కాలికమాన్‌వైపు మళ్లిస్తారు.ర్యాలీ పురాణిహవేలికి రాగానే ట్రాఫిక్‌ను బిబి బజార్ మీదుగా ఈటెబార్ చైక్, బిబి బజార్ మీదుగా హఫీజ్ దాంగ్ కా మసీద్, భవానీనగర్, తలాబ్ కట్టా ఏరియా వైపు మళ్లిస్తారు. కాళికమాన్ నుంచి వచ్చే వాహనాలను మూసి వేస్తారు, అర్మాన్ హోటల్, ప్రిన్స్ కాలేజీ లేన్‌వద్ద డైవర్ట్ చేసి హఫీజ్ డాంగ్ కా మసీద్, చౌక్ మైదాన్.
ర్యాలీ పిస్తాహౌస్‌కు రాగానే ట్రాఫిక్ మోఘల్‌పుర, బిబి బజార్, అక్కన్న మాదన్న టెంపుల్ నుంచి హఫీజ్ డాంగ్ కా మసీద్, అశోక్ పిల్లర్, రాజేష్ మెడికల్ హాల్ వైపు అనుమతించరు. మోఘల్‌పుర నుంచి వచ్చే వాహనాలను మీర్ కా ధారా మీదుగా గౌలిపుర రోడ్డు వైపు మళ్లిస్తారు. ర్యాలీ బిబి బజార్‌కు రాగానే ట్రాఫిక్ తలాబ్ కట్ట నుంచి ఓల్టా హోటల్ వైపు అనుమతించరు. ముంతాజ్ ఖాన్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ర్యాలీ వెళ్లే వరకు ట్రాఫిక్ మొఘల్‌పుర వాటర్‌ట్యాంక్ రోడ్డు వైపు మళ్లిస్తారు.