Monday, December 23, 2024

సెక్రటేరియట్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః తెలంగాణ రాష్ట్ర నూతన సెక్రటేరియట్ భవనాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ నెపథ్యంలో సెక్రటేరియట్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ సిపి సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమలులో ఉండనున్నాయి. సచివాలయం వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. పాస్ హోల్లడర్లు వారికి కేటాయించిన ప్రాంతాల్లో వాహనాలను పార్కింగ్ చేయాలని కోరారు. లోపలికి వెళ్లే ముందు పోలీసులకు పాస్‌లను చూపించాలని పోలీసులు తెలిపారు.

వివి విగ్రహం, నెక్లెస్‌రోడ్డు, ఎన్టిఆర్ మార్గ్ మధ్య వాహనాలకు అనుమతి లేదు. తెలుగుతల్లి జంక్షన్‌ను మూసివేయనున్నారు. ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను వివి విగ్రహం వద్ద షాదాన్, నిరంకారి భవనం వైపు మళ్లిస్తారు.
నిరంకారి, చింతల్ బస్తీ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌ను మూసివేయనున్నారు.
ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ట్యాంక్‌బండ్, రాణిగంజ్ వైపు వెళ్లే వాహనదారులు తెలుగు తల్లి ఫ్లైవర్ మీదుగా లోయర్ ట్యాంక్‌బండ్ చేరుకోవాల్సి ఉంటుంది.
ట్యాంక్‌బండ్ , తెలుగుతల్లి జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించరు. ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
బిఆర్‌కె భవన్ నుంచి ఎన్టిఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ మీదుగా ఇక్బాల్ మినార్ వైపు మళ్లించనున్నారు.
బడా గణేష్ లేన్ నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోటరి వైపు నుంచి వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను బడా గణేష్ లేన్ నుంచి రాజ్‌ధూత్ లేన్ వైపునకు మళ్లించనున్నారు.
ఎన్టిఆర్ గార్డెన్, ఎన్టి ఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ మూసివేయనున్నారు.

ఆర్టిసి బస్సులు మళ్లింపు…
అఫ్జల్ గంజ్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే ఆర్టిసి బస్సులు, రవీంద్రభారతి, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, కట్టమైసమ్మ టెంపుల్, లోయర్ ట్యాంక్‌బండ్, డిబిఆర్ మిల్స్, కవాడిగూడ మీదుగా సికింద్రాబాద్ చేరుకోవాలి.
వివి విగ్రహం జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పిఎస్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కంపౌండ్ రోడ్డు, తెలుగుతల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, కట్టమైసమ్మ టెంపుల్, ట్యాంక్‌బండ్, లిబర్టీ జంక్షన్ల వైపు వాహనాలకు అనుమతి లేదు.
రద్దీ ఉండే జంక్షన్లు….
వివి విగ్రహం జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పిఎస్ జంక్షన్, రవీంద్రభారతి జంక్షన్, మింట్ కాంపౌండ్ రోడ్డు, తెలుగుతల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, కట్టమైసమ్మ( లోయర్ ట్యాంక్‌బండ్), ట్యాంక్‌బండ్, లిబర్టీ జంక్షన్లలో రద్దీ అధికంగా ఉంటుందని వాటి నుంచి ప్రయాణాన్ని మానుకోవాలని పోలీసులు కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News