Sunday, January 19, 2025

ఈ నెల 16 నుంచి చేనంబర్ జంక్షన్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ప్లైఓవర్ పనుల కారణంగా 6వ నంబర్ జంక్షన్, అంబర్‌పేట్ టి జంక్షన్ రోడ్డును ఈ నెల 16వ తేదీ నుంచి మూసివేయనున్నారు. రెండు జంక్షన్ల మధ్య సూపర్ స్ట్రక్చర్ పనులు చేయనున్నారు. పనులు పూర్తయ్యే వరకు రెండు జంక్షన్ల మధ్య రోడ్డును మూసివేయనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. ఉప్పల్ నుంచి వచ్చే 6 నంబర్ జంక్షన్ వైపు వచ్చే ఆర్‌టిసి బస్సులు, భారీ వాహనాలను అంబర్‌పేట టి జంక్షన్ వద్ద నుంచి ఆలీకేఫ్, జింతాతిలిస్మాత్, గోల్నాక న్యూ బ్రిడ్జి, గోల్నాక, నింబోలిఅడ్డా, టూరిస్ట్, టివై మండి నుంచి వెళ్లాలి.

ఆర్‌టిసి బస్సులు, భారీ వాహనాలు జింతాతిలిస్మాత్ నుంచి 6వ నంబర్ జంక్షన్ వైపు అనుమతించరు. సాధారణ వాహనాలకు అనుమతి ఉంది.తిలక్‌నగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లే వాహనాలను 6వ నంబర్ జంక్షన్, జింతాతిలిస్మాత్, ఆలీ కేఫ్, అంబర్‌పేట టి జంక్షన్ నుంచి వెళ్లాలి. చాదర్‌ఘాట్ నుంచి వచ్చే భారీ వాహనాలను నింబోలిఅడ్డా మీదుగా టూరిస్ట్ వైపు వెళ్లాలి.
ఎల్‌బి నగర్, బోడుప్పల్ నుంచి వచ్చే భారీ వాహనాలను ఉప్పల్ , తార్నాక మీదుగా వెళ్లాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News