Sunday, December 22, 2024

పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న కేంద్ర మంత్రి అమిత్‌షా బహిరంగ సభ నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. యూపిఎస్‌సి సివిల్స్ పరీక్ష రాసేవారు తమ హాల్ టికెట్‌ను చూపిస్తే వారిని పంపిస్తారని, వారికి ట్రాఫిక్ ఆంక్షల నుంచి మినహాయింపు ఉందని పేర్కొన్నారు.

సిటిఓ నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే వాహనాలు పరేడ్‌గ్రౌండ్, వైపు అనుమతించరు. ప్లాజా ఎక్స్ రోడ్డు నుంచి ఎస్‌బిఐ ఎక్స్ రోడ్డును మూసివేస్తారు. వైఎంసిఏ ఫ్లైఓవర్ మీదుగా ట్రాఫిక్‌ను అనుమతిస్తారు.
బోయిన్‌పల్లి, టాడ్‌బండ్ మీదుగా టివోలి వైపు వెళ్లే వాహనాలను బ్రూక్‌బాండ్ మీదుగా సిటిఓ వైపు మళ్లిస్తారు.
కార్ఖాన, జెబిఎస్ మీదుగా ఎస్‌బిహెచ్ ప్యాట్నీ వైపు వచ్చే వాహనాలను స్వీకర్ ఉపకార్ మీదుగా టివోలి, బ్రూక్‌బాండ్, బాలమ్‌రాయ్, సిటిఓ వైపు మళ్లిస్తారు.
కార్ఖాన, జెబిఎస్ మీదుగా ఎస్‌బిహెచ్ ప్యాట్నీ నుంచి వచ్చే వాహనాలను స్వీకర్, ఉపకార్, మీదుగా వైఎంసిఏ, క్లాక్ టవర్, ప్యాట్నీ మీదుగా మళ్లిస్తారు.
ఎస్‌బిఐ నుంచి వచ్చే వాహనాలను స్వీకర్ ఉపకార్ నుంచి వైఎంసిఏ, సిటిఓ వైపు మళ్లిస్తారు.
ఆర్‌టిఏ తిరుమలగిరి, కార్ఖాన, మల్కాజ్‌గిరి, సఫిల్‌గూడ మీదుగా ప్లాజా వైపు వచ్చే వాహనాలను టివోలి మీదుగా స్వికర్, ఉపకార్, వైఎంసిఏ, బ్రూక్‌బాండ్, బాలమ్‌రాయ్, సిటిఓ వెళ్లాలి.
టివోలి ఎక్స్ రోడ్డు నుంచి ప్లాజా ఎక్స్ రోడ్డు రెండు వైపులా మూసివేస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News