Wednesday, January 22, 2025

పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః తెలంగాణ జాతీయ సమైక్యతా దినోవత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.

ఎంజే మార్కెట్ నుంచి పబ్లిక్ గార్డెన్ వైపు వచ్చే వాహనాలను తాజ్ ఐస్‌ల్యాండ్ మీదుగా ఎక్ మినార్, బజార్‌ఘాట్, ఆసిఫ్‌నగర్, రెడ్‌హిల్స్, అయేధ్య హోటల్, లకిడికాపూల్ వైపు వెళ్లాలి.
నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి నిరంకారి భవన్ మీదుగా రవీంద్ర భారతి వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ సైఫాబాద్ పిఎస్ మీదుగా టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, సెక్రటేరియట్ రోడ్డు, తెలుగుతల్లి, అంబేద్కర్ స్టాట్యూ, లిబర్టీ, బషీర్‌బాగ్, అబిడ్స్.
హైదర్‌గూడ, కింగ్ కోఠి నుంచి హెచ్‌టిపి జంక్షన్, పబ్లిక్ గార్డెన్ వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ జంక్షన్ మీదుగా లిబర్టీ, తెలుగుతల్లి, ఎన్‌టిఆర్ మార్గ్, ఇక్బాల్ మినార్, ఓల్డ్ పిఎస్ సైఫాబాద్, లకిడాపూల్ బ్రిడ్జి, బిజెఆర్ స్టాట్యూ, అబిడ్స్ వైపు మళ్లిస్తారు.
ట్యాంక్‌బండ్ నుంచి రవీంద్రభారతి వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్ మినార్ మీదుగా ఓల్డ్ సైఫాబాద్ పిఎస్, లకిడికాపూల్ బ్రిడ్జి వైపు మళ్లిస్తారు.
సుజాతా స్కూల్ మీదుగా పబ్లిక్ గార్డెన్ వైపు వచ్చే వాహనాలను ఎఆర్ పెట్రోల్ పంప్ మీదుగా బిజెఆర్ స్టాట్యూ వైపు మళ్లిస్తారు.
ఆదర్శ నగర్ నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కాంప్లెక్స్ జంక్షన్ వైపు వచ్చే వాహనాలను ఆదర్శనగర్ మీదుగా లిబర్టీ రోడ్డు, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News