- Advertisement -
ఉత్తర్వులు జారీ చేసిన నగర అదనపు సిపి అనిల్‌కుమార్
హైదరాబాద్: జాతీయ రహదారి 163లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభించనున్న నేపథ్యంలో నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని అంబర్‌పేట ఫ్లైఓవర్ పనులు జాతీయ రహదారి 163, (పాతనంబర్ 202) శలీం చర్చ్ నుంచి ముకరం హోటల్, అంబర్‌పేట వరకు పనులు రోడ్డు నంబర్ 6 వరకు ప్రారంభం కానున్నాయి. పనులు ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరారు. వాహనదారులు, ప్రజలు సహకరించాలని కోరారు.
Traffic restrictions in amberpet hyderabad
- Advertisement -