Monday, December 23, 2024

బల్కంపేటలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఈనెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఎల్లమ్మ టెంపుల్‌కు భక్తులు రావడంతో వాహనాల రద్దీ ఏర్పడుతుందని పేర్కొనారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు. గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వెళ్లే వాహనాలను ఎస్‌ఆర్ నగర్ టి జంక్షన్ వద్ద నుంచి ఎస్‌ఆర్ నగర్ కమ్యూనిటీ హల్, అభిలాష టవర్స్, బికె గూడ ఎక్స్ రోడ్డు, శ్రీరాం నగర్ ఎక్స్ రోడ్డు, సనత్‌నగర్, ఫతేనగర్ రోడ్డు వైపు వెళ్లాలి. ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి బల్కంపేటకు వచ్చే వాహనాలు అనుమతించరు, న్యూబ్రిడ్జి వద్ద నుంచి కట్టమైసమ్మ టెంపుల్, బేగంపేట వైపు మళ్లిస్తారు.

గ్రీన్‌ల్యాండ్ నుంచి వచ్చే వాహనాలను బకుల్ అపార్ట్‌మెంట్స్, ఫుడ్ వరల్డ్ నుంచి బల్కంపేట వైపు అనుమతించరు. ఫుడ్ వరల్డ్ ఎక్స్ రోడ్డు మీదుగా సోనాభాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రివనం, ఎస్‌ఆర్ నగర్ టి జంక్షన్ వెపు వెళ్లాలి. బేగంపేట నుంచి వచ్చే వాహనాలను కట్టమైసమ్మ టెంపుల్ మీదుగా బల్కంపేట వైపు అనుమతించరు. గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్, ఎస్‌ఆర్ నగర్ టి జంక్షన్ లెఫ్ట్ టర్న్ తీసుకుని ఎస్‌ఆర్‌నగర్ కమ్యూనిటీ హాల్ వైపు వెళ్లాలి. బై లైన్స్, లింకురోడ్లు, ఎస్‌ఆర్ నగర్ టి జంక్షన్ నుంచి ఫతేనగర్ రోడ్డు మూసివేస్తారు.

పార్కింగ్ ప్రాంతాలు….
ఆర్‌అండ్ బి ఆఫీస్, జిహెచ్‌ఎంసి గ్రౌండ్, పద్మ శ్రీ నుంచి నేచర్ క్యూర్ ఆస్పత్రి రోడ్డు సైడ్ పార్కింగ్ ఫతేనగర్ అండర్ రైల్వే బ్రిడ్జి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News