Monday, December 23, 2024

బల్కంపేటలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః  బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ సుధీర్‌బాబు ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అమలులో ఉండనున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని కోరారు.గ్రీన్‌ల్యాండ్స్, మాతాటెంపుల్, సత్యం థియేటర్ నుంచి ఫతేనగర్ వెళ్లే వాహనాలను ఎస్‌ఆర్ నగర్ టి జంక్షన్ నుంచి ఎస్‌ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాష టవర్స్, బికె గూడ ఎక్స్ రోడ్డు, శ్రీరాంనగర్ ఎక్స్ రోడ్డు, సనత్‌నగర్ వైపు వెళ్లాలి.
ఫతేనగర్ ఫ్లైఓవర్ నుంచి బల్కంపేట వైపు వెళ్లే వాహనాలను అనుమతించగరు. వాహనాలను న్యూ బ్రిడ్జి మీదుగా కట్టమైసమ్మ టెంపుల్, బేగంపేట వైపు మళ్లిస్తారు.

గ్రీన్‌ల్యాండ్స్, బకుల్ అపార్ట్‌మెంట్స్, ఫుడ్ వరల్డ్ నుంచి బల్కంపేట వెళ్లే వాహనాలను ఫుడ్ వరల్డ్ ఎక్స్ రోడ్డు మీదుగా సోనాబాయి టెంపుల్, సత్యం థియేటర్, మైత్రివనం, ఎస్‌ఆర్ నగర్ టి జంక్షన్ వైపు మళ్లిస్తారు. బేగంపేట,కట్టమైసమ్మ టెంపుల నుంచి బల్కంపేట వైపు వెళ్లే వాహనాలను అనుమతించరు. గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్,ఎస్‌ఆర్ నగర్ టి జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని ఎస్‌ఆర్ నగర్ కమ్యూనిటీ హాల్ నుంచి వెళ్లాలి.
బల్కంపేట వైపు వెళ్లే బైలేన్లను, లింక్ రోడ్లను మూసివేస్తారు.

భక్తుల వాహనాల పార్కింగ్….
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకునే భక్తులు తమ వాహనాలను ఆర్ ఆండ్ బి ఆఫీస్, నేచర్ క్యూర్ ఆస్పత్రి, జిహెచ్‌ఎంసి గ్రౌండ్, పద్మ శ్రీ నుంచి నేచర్ క్యూర్ ఆస్పత్రి రోడ్డు సైడ్ పార్కింగ్ చేయాలి, ఫతేనగర్ అండ్ రైల్వే బ్రిడ్జి, పద్మ శ్రీ టవర్స్ నుంచి ఆర్ అండ్ బి వరకు వాహనాలను పార్కింగ్ చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News